కేసీఆర్‌ పేరు మారుమ్రోగిపోతోంది… థాంక్స్ బిడ్డా!

తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశ రాజకీయాలలో ‘గుణాత్మకమైన మార్పు’ తీసుకురావాలనుకున్నారు. కానీ అదేమి దురదృష్టమో కానీ ఆయన జాతీయ రాజకీయాల గురించి ఆలోచించిన ప్రతీసారి బెడిసికొడుతూనే ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికలలో ‘కారు.. సారు… ఢిల్లీ సర్కారు…’ అంటూ కేసీఆర్‌ చేసిన హడావుడి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌, బీజేపీ రెంటికీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత మెజార్టీ రాదని, కనుక తనకు 17 మైనస్ ఒక్కటి (మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీకి ఒకటి పోగా) 16 ఎంపీ సీట్లు ఇస్తే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానన్నారు.

ADVERTISEMENT

కానీ గత ఎన్నికలలో ఎన్డీయే కూటమి పూర్తి మెజార్టీతో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడంతో ఢిల్లీకి వెల్లసిన కేసీఆర్‌ కారుని గ్యారేజీలో పెట్టుకోక తప్పలేదు.

కానీ దేశంలో ఏ పార్టీ ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడనప్పుడు కేవలం 16 ఎంపీ సీట్లతో కేసీఆర్‌ ఎలా చక్రం తిప్పాలనుకున్నారనే బేతాళ ప్రశ్నకు బహుశః విక్రమార్కుడు కూడా జవాబు చెప్పలేడేమో?

ఆ తర్వాత మరో 5 ఏళ్ళపాటు అంటే 2023 శాసనసభ ఎన్నికల వరకు ‘మోడీ-గీడీ, ఈడీ-బీడీ, సీబీఐ-గీబీఐ’ అంటూ కేసీఆర్‌ పలికిన ప్రగల్భాలు, మహారాష్ట్రలో చేసిన హడావుడి, ఏపీ రాజకీయ నిరుద్యోగులకు బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కొనేసి కాపాడేస్తానంటూ చేసిన హడావుడి, ఆ తర్వాత కూతురు కేసు కారణంగా కర్ణాటక ఎన్నికలలో కుమారస్వామికి హ్యాండ్ ఇచ్చేయడం తదితర బిఆర్ఎస్ సువర్ణాధ్యాయాలన్నీ అందరికీ తెలిసినవే.

తెలంగాణ సాధించి, అభివృద్ధి చేసినా శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు. అయినా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని 3-6 నెలల్లో పడగొడతానని ప్రకటించడంతో, రేవంత్‌ రెడ్డి కూడా “రా… నీ అయ్యా… దమ్ముంటే వచ్చి పడగొట్టి చూపించు. అయినా శాసనసభకు రావడానికే భయపడుతున్న నువ్వా నా ప్రభుత్వాన్ని పడగొట్టేది… చూస్కో నా తడాఖా…” అంటూ బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తున్నారు.

ఇంత చరిత్ర, ఇంత విషాదం తర్వాత చివరాఖరుగా చెప్పుకోవలసిన ఓ మంచి మాట కూడా ఉంది.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్నా తిప్పలేకపోతున్నారు. ఆయన కలను కూతురు కల్వకుంట్ల కవిత తీరుస్తున్నారిప్పుడు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళినప్పటి నుంచి జాతీయస్థాయిలో కేసీఆర్‌ పేరు మారుమ్రోగిపోతోంది. జాతీయ మీడియాకు మరో వార్త లేన్నట్లు “తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్…” అంటూ ఒకటే ఊదరగొట్టేస్తున్నాయి. మళ్ళీ ఇంతకాలానికి కూతురు పుణ్యమాని కేసీఆర్‌ పేరు దేశమంతా మారుమ్రోగిపోతోంది. మరి ఆయన కల నెరవేరిన్నట్లే… నా?

Share

Recent Posts

The Paradise: Can Nani Beat Biggest US Advances 2026?

The Paradise is already making its presence felt among the biggest US premiere pre-sales of…

14 minutes ago

Rashmika’s Diction Answer Comes With a Twist

Rashmika Mandanna had the audience laughing at the Mysaa event when the conversation turned to…

44 minutes ago