ఈ సారి కేసీఆర్ వంతు! మరి చంద్రబాబు ఏం చేస్తారో..?

kcr inviting chandrababu for chandi yagamనవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరైన తెలంగాణా సిఎం కేసీఆర్ విమర్శకుల ప్రసంశలు పొందారు. నిజానికి ఆ వేడుకలో ప్రధాని మోడీని మించి కేసీఆర్ హైలైట్ అయ్యారు. అలాగే ఏపీ సర్కార్ కూడా కేసీఆర్ ను విశిష్ట అతిధిగా భావించి, సకల మర్యాదలు చేసింది. అయితే ఈ సారి సీన్ రివర్స్ కానుంది. డిసెంబర్ 23వ తేదీన మెదక్ జిల్లా, జగదేవపూర్ మండలం, ఎరవలిలోని వ్యవసాయ కేత్రంలో తాను నిర్వహించబోయే చండీ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించబోతున్నట్లు కేసీఆర్ స్పష్టం చేసారు.

ఈ యాగానికి అయ్యే ఖర్చులపై వివాదం అవసరం లేదని, తన సొంత ఖర్చులతో యాగాన్ని జరుపబోతున్నట్లు తెలిపారు. సీపీఐ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వానికి, ఈ యాగానికి ఎటువంటి ఎటువంటి సంబంధం లేదని, పూర్తిగా నా సొంత వ్యవహారమని అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలను కూడా ఈ యాగానికి ఆహ్వానిస్తానని కేసీఆర్ తెలిపారు.

చంద్రబాబు ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించగా, కేసీఆర్ తన వ్యక్తిగత కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య అవసరం రీత్యా ఏపీ సిఎం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశమే ఎక్కువ వుందనేది ప్రాధమికంగా లభ్యమవుతున్న సమాచారం.

ADVERTISEMENT
Latest Stories