సెప్టెంబర్ లో ఏం జరగబోతోంది?

KCR to dissolve assembly  in september 2018తెలంగాణలో ఇప్పుడు ఒకటే అతిపెద్ద చర్చ. ఎవరిని కదిపినా కేసీఆర్ చేయదలచిన అసెంబ్లీ రద్దు అంశం, ముందస్తు ఎన్నికలపై మాటలే. అసెంబ్లీ గడువు వచ్చే సంవత్సరం జూన్ వరకూ ఉండగా, వచ్చే నెలలో అసెంబ్లీని రద్దు చేసి, ఆపై డిసెంబర్ లోగా జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే తెలంగాణలోనూ ఎన్నికలు జరిపించాలన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనలు ఏం చెబుతున్నాయన్న విషయాన్ని పరిశీలిస్తే…

భారత రాజ్యాంగంలో శాసనసభ రద్దయితే, ఆరు నెలల్లోగా కచ్చితంగా ఎన్నికలు జరిపించాలన్న స్పష్టమైన నిబంధన ఏదీ లేదు. ఒకవేళ ఆరు నెలలు దాటితే మాత్రం ఆపద్ధర్మ ప్రభుత్వం పడిపోయి, పాలన రాష్ట్రపతి చేతుల్లోకి వస్తుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలో గానీ, రాజ్యాంగంలో గానీ ఆరు నెలల నిబంధన లేదని గుర్తు చేస్తున్న రాజ్యాంగ నిపుణులు, ఏదైనా అసెంబ్లీ సీటు ఖాళీ అయితేనే ఆరు నెలల నిబంధన ఉందని, పూర్తి అసెంబ్లీ విషయానికి వస్తే, తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ పరిధిలో మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.

ADVERTISEMENT

ఇక అసెంబ్లీ కాల వ్యవధికి ప్రామాణికం తొలి సమావేశమే. తొలి సమావేశం తరువాత ఐదేళ్ల పాటు అసెంబ్లీ కాల వ్యవధి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించే తేదీలు సైతం అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక అసెంబ్లీకి సైతం ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాలని నిబంధన ఉంది. తెలంగాణ అసెంబ్లీ వేసవి సమావేశాలు మార్చి 29న ముగిశాయి. అంటే తిరిగి సెప్టెంబర్ 28లోగా మరోసారి సమావేశం కావాల్సిందే. అసెంబ్లీని సమావేశపరచకుండా రద్దు చేసిన పక్షంలో మార్చి 29వ తేదీనే ఈసీ పరిగణనలోకి తీసుకుని అక్కడి నుంచి ఆరు నెలలను లెక్కిస్తుంది.

అదే జరిగితే సెప్టెంబర్ 28 తరువాత తెలంగాణలో రాష్ట్రపతి పాలన మొదలవుతుంది. ఒకవేళ సెప్టెంబర్ లో అసెంబ్లీని సమావేశపరిచి, ఆపై రద్దు చేస్తే, మార్చి వరకూ ఆపద్ధర్మ ప్రభుత్వ హోదాలో కేసీఆర్ ప్రభుత్వమే పరిపాలించే అవకాశాలు ఉన్నాయి. అయితే రద్దు తరువాత ఎన్నికలు జరిపించే విషయం మాత్రం పూర్తిగా ఎన్నికల సంఘం విచక్షణపైనే ఆధారపడి వుంటుంది. దీంతో రాబోయే సెప్టెంబర్ నెలలో తెలంగాణాలో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారాయి.

ADVERTISEMENT
Latest Stories