అలా జరిగితే ఏపీ ఉపముఖ్యమంత్రి ఉరేసుకుంటారట

ke-krishnamurthy-says no alliance with congressకాంగ్రెస్ పార్టీతో తెదేపా పొత్తు ఉండవచ్చన్న వార్తల పై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఆ పార్టీతో కనుక పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకోవటానికి సిద్ధమని ఆయన తెలిపారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ కపట రాజకీయాల్లో భాగంగానే వైకాపా ఎంపీలు రాజీనామా చేశారని విమర్శించారు.

ADVERTISEMENT

పవన్, జగన్‌ కేంద్రంతో చేతులు కలపడం బాధాకరని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా… ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయం నిర్ణయిస్తామని అయితే కాంగ్రెస్ తో మాత్రం పొత్తు ఉండదని కేఈ తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న నవనిర్మాణ దీక్షల సంధర్భంగా చంద్రబాబు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని విమర్శిస్తున్నా టీడీపీ కాంగ్రెస్ తో కలిసి నడవబోతుంది అనే వార్తలు కొన్ని వర్గాలు పని గట్టుకుని వ్యాపింపచేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories