‘మాస్’ మసాలా…ఒక్కటే మెప్పిస్తుంది!

KGF movie collectionsమారి-2 …అంతరిక్షం..పడి పడి లేచే మనసు..జీరో..కేజీఎఫ్ ఈ సినిమాలు అన్నీ మొన్న శుక్రవారం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..అయితే ‘మారి-2’ అసలు లెక్కల్లోనే లేదనుకోండి…ఎందుకంటే అలాంటి డిజాస్టర్ ను మూటగట్టుకుంది…ఇక షారూక్ ‘జీరో’ కూడా ‘జీరో’ గానే మిగిలిపోయింది..అది కూడా బ్యాడ్ ఫిలిం గానే టాక్ తెచ్చుకుంది..

[m9ad]

ADVERTISEMENT

ఇక మిగిలిన వాటిల్లో ‘పడి పడి లేచే మనసు’ తొలి రోజు మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది…అంతరిక్షం పర్వాలేదు అన్న టాక్ తెచ్చుకుంది…వీటన్నింటిలో ‘కే.జీ.ఎఫ్’ ఒక్కటే మెల్లగా దూసుకుపోతుంది..

భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా తొలి రోజు భారీ అంచనాలను అందుకోకపోయినప్పటికీ…రెండో రోజు నుంచి కలెక్షన్స్ పరంగా మంచి రిపోర్ట్స్ సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాల మాట. ఇక ఈ హడావిడిలో ‘రోబో-2.0’ చాఫ్టర్ క్లోజ్ అనే చెప్పాలి..

అయితే ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే వీటి హడావిడి మధ్య మౌత్ టాక్ తో దూసుకుపోతుంది చిన్న సినిమా ‘హుషారు’…మొత్తంగా వీకెండ్ హంగామాలో విజేతగా నిలిచాడు హీరో యష్.

ADVERTISEMENT
Latest Stories