భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఫస్ట్ లుక్స్ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీవల ఏదైనా పెద్ద సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం, ఆ వెంటనే ఫలానా సినిమా నుండి కాపీ చేసారంటూ సోషల్ మీడియాలో సందడి చేయడం క్షణాల్లో జరిగిపోతోంది. “ఖైదీ నంబర్ 150” సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదని ఈ పోస్టర్ హల్చల్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ స్టిల్ ఒక వైపు, చిరంజీవి స్టిల్ మరో వైపు పెట్టి ఈ కాపీ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఎంత ‘అన్నయ్య’ సినిమా అయినా… ‘కాపీ’ విషయం వచ్చే పాటికి ‘తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే…’ అన్న సిద్ధాంతంతో అభిమానులు ముందుకెళ్తున్నట్లుగా కనపడుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



