టాలీవుడ్ లో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ, ప్రస్తుతం రామ్ చరణ్ తో మరో సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇలా తెలుగులో బిగ్ స్టార్స్ ను ఆకర్షించిన ఈ బ్యూటీ, బాలీవుడ్ లో కూడా బడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ తర్వాత కియారా కెరీర్ మరో మలుపు తీసుకున్నట్లుగా కనపడుతోంది.
ADVERTISEMENT
[m9ad]
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో హాట్ హాట్ పేరుగా మారిన కియారా, ఇటీవల ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొంది. శ్యామల భూమిక డిజైన్ చేసిన గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయింది కియారా. తనలోని గ్లామరస్ యాంగిల్ ను ఈ రకంగా బయటకు తీసిందో ఏమో గానీ, ఈ వీడియోలో ‘భరత్ అనే నేను’ బ్యూటీ కన్నులవిందుగా మారింది.
ADVERTISEMENT



