ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ యువకుల నైపుణ్యానికి పెట్టిందే పేరు గా కనపడుతుంది. ఒక వైపు వైభవ్ సూర్యవంశీ, మరో వైపు ఆయుష్ మహాత్రే, ముకుల్ చౌదరి, సమీర్ రిజ్వి, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి ఎందరో యువ ఆటగాళ్లు తమ టాలెంట్ తో ఈ ఐపీఎల్-2026 లో చెలరేగిపోతున్నారు.
వీరు సీనియర్ ఆటగాళ్లతో పోలిస్తే చాలా తక్కువ సాలరీ తీసుకుని, జట్టు విజయాల కొరకు తమ పర్సనల్ రికార్డులను కూడా త్యజించటం ఈ సీజన్లో ఎన్నోసార్లు చూసాము. కానీ, కోల్కతా జట్టు ఈ లాజిక్ ను మిస్ అయ్యిందా అంటే, అవునననే చెప్పవచ్చు!
కోట్లు కోట్లు వెచ్చించి మరి విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే బదులు ఉన్న లోకల్ టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకుంటే, అది తమ ఫ్రాంచైజ్ కు అలాగే భారత జట్టుకు కూడా ఉపయోగపడుతుంది. గతంలో ఇలానే ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను 2024 ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు కొనుగోలు చేసారు.
సుమారు 25 కోట్లు పెట్టి స్టార్క్ ను కొనుగోలు చేసిన అదే జట్టు వచ్చే సీజన్ కు మరల స్టార్క్ ను వేలంలోకి వదిలేశారు.
మళ్ళీ, 2026 సీజన్ కు జరిగిన వేలంలో మిచెల్ స్టార్క్ ధరకు కన్నా అధిక రేటు తో 25.2 కోట్లు వ్యచ్చించి కామెరాన్ గ్రీన్ ను కొనుగోలు చేసారు కోల్కతా ఫ్రాంచైజ్.
ఈ నిర్ణయం ప్రస్తుతానికి ఒక అట్టర్-ఫ్లాప్ గా మారుతుందనే చెప్పాలి. మొదటి 3 మ్యాచ్లు అసలు బౌలింగ్ లో పాలుపంచుకొని కామెరాన్ గ్రీన్, తరువాత బాల్ ను అందుకున్నప్పటికీ, తాను బౌలింగ్ చేయకపోతేనే బావుంటుందని అభిమానులు అభిప్రాయం పడేలా అయ్యేలా చేసాడు.
కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ నేరుగా గ్రీన్ ను జట్టు నుండి తొలగించి, జట్టుకు సరిపోయే కాంబినేషన్ ను సమకూర్చాలని తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఆఫ్రికన్ లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్, కోల్కతా జట్టు గ్రీన్ ను టీం లో ఇంకా కొనసాగించటానికి కారణం తన ప్రైస్-ట్యాగ్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.
ఈ సీజన్లో కోల్కతా జట్టు 5 మ్యాచ్లలో పాల్గొనగా, ఇప్పటికీ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేసుకోలేక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగున నిలిచారు. లోకల్ ఆటగాళ్ల కన్నా, ఫారెన్ స్టార్స్ ఎక్కువమంది జట్టులో ఉండటంతో ఎవరిని ఆడించాలనే సందిగ్దతకు కూడా కోల్కతా జట్టు లోనవకతప్పదు.
కేవలం కామెరాన్ గ్రీన్ వైఫల్యం వల్లనే కోల్కతా ఇలా ఉన్నారా అంటే.. దానికి తోడు ఫిన్ అలెన్ ఓపెనింగ్ లో తడబడటం, రహానే కెప్టెన్సీ లో తడబడటం, ఇలా కోల్కతా జట్టు వైఫల్యాలకు ఎన్నో కారణాలున్నాయి. ఇప్పటికే 3-టైం చాంపియన్స్ గా ఉన్న కోల్కతా జట్టు, వచ్చిన ఓటముల నుండి కోలుకుని తిరిగి స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం..!






