చంద్రబాబు, లోకేషులను తాను ఎందుకు తిడతానో చెప్పిన కొడాలి నాని

Kodali Nani slams chandrababu naidu - nara lokeshజగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లోని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ని ప్రతిపక్షాలు బూతుల మంత్రి అని పిలుస్తారు. నాని మైక్ ముందుకు వస్తే చంద్రబాబు నాయుడు, లోకేషుల మీద బూతుల వర్షం కురిపిస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు దానిని హీరోయిజంగా అనుకుంటే… సామాన్యులు ఇంట్లో పిల్లల ముందు ఆయన ఇంటర్వ్యూలు చూడలేని పరిస్థితి.

కాగా… తాను చంద్రబాబు పై బూతులు ఎందుకు వాడతాను అనే దానికి కారణం చెప్పుకొచ్చారు మంత్రి ఒక ఇంటర్వ్యూ. చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఫేక్ సీఎం, అవినీతిపరుడు అని తరచు అభివర్ణించడం ఆయనకు నచ్చలేదట. దానిని తట్టుకోలేకే తాను కూడా తిట్టాల్సి వస్తుందని నాని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అయితే గతంలో జగన్, నాని ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అప్పటి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ని మాటలు అన్నారు కదా? జగన్ అయితే చంద్రబాబు నాయుడుని నడిరోడ్డు మీద ఉరి వెయ్యాలని అప్పట్లో సంచలనం సృష్టించారు. నాని గారి బూతుల సంగతి తెలిసిందే.

అప్పుడు ముఖ్యమంత్రి అంటే లేని మర్యాద ఇప్పుడు కావాలా అని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు. అయినా రాజకీయాలలో లాజిక్లతో పని ఏముందిలే! మరోవైపు అరగంట సాగిన ఆ ఇంటర్వ్యూ నాని గారు చంద్రబాబు నాయుడు, లోకేషులను కలిపి దాదాపుగా యాభైకు పైగా సార్లు తిట్లు అందుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories