కొడాలి నాని ‘గొప్పతనం’ ఇదే!

Kodali Nani‘బూతుల మంత్రి’గా ఏపీ రాజకీయాల్లో ఎనలేని కీర్తి ప్రతిష్టతలను సొంతం చేసుకున్న గుడివాడ శాసనసభ సభ్యుడు కొడాలి నానికి సంబంధించిన ఓ రెండు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాయకుడు కనిపించిన వెంటనే ఆనందం ఆపుకోలేక కార్యకర్తలు గానీ, అభిమానులు గానీ నినాదాలు చేస్తుంటారు. ఇది రొటీన్!

ADVERTISEMENT

అయితే నాయకుడే తనను పొగడాలని కార్యకర్తలను ఆదేశిస్తే… ఇక్కడే కొడాలి నాని యొక్క గొప్పతనం బయట పడుతుందంటున్నారు నెటిజన్లు. ‘జై నాని అని అరవండి’ అంటూ కారులో కూర్చుని కార్యకర్తలకు సూచించిన ఈ గుడివాడ ఎమ్మెల్యే వీడియో ఇంటర్నెట్ లో షికారు చేస్తోంది. మొత్తానికి ‘భలే నాయకుడు’ మన నాని అని అనుకోవడం ఏపీ జనుల వంతు!

మరి నాని గారి ఇంకో గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలా… ఏం లేదులెండి… తనను మొదటగా జైలుకు పంపించింది… మెడలోపలక వేసి రౌడీ షీట్ ఓపెన్ చేసింది ఒక్కరేనని, బత్తిన శ్రీనివాసులు హయాంలో ఇదంతా జరిగిందని సగర్వంగా నానినే చెప్పుకున్నారు. ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే… ఇప్పుడు కొడాలి నాని చేతుల మీదుగా బత్తిన శ్రీనివాసులు పురస్కారం అందుకోవడం.

ఒక్క కొడాలి నాని తప్ప, ఇలా తన గొప్ప ‘ఫ్లాష్ బ్యాక్’ను మరెవరూ బయటకు చెప్పే సాహసం చేయరని, ఇప్పటివరకు బోలెడు సినిమాలు వచ్చాయి గానీ, ఏ సినిమాలో కూడా ఇలాంటి సీన్ లేదని… ఇలా రకరకాలుగా నెటిజన్లు తమకు తోచిన రీతిలో నాని పట్ల అభిమానాన్ని చూపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories