వివాదాస్పదంగా మారిన న్యూడ్ ఫోటోషూట్!

kolkata nude bride photoshootప్రస్తుత ప్రపంచంలో సృజనాత్మకత ఎంతగా పెరుగుతుందో, అంతేస్థాయిలో మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. అందుకు నిదర్శనమే తాజాగా హల్చల్ చేస్తోన్న న్యూడ్ ఫోటోషూట్. ఓ మోడల్ ను న్యూడ్ గా చిత్రీకరిస్తూ ప్రముఖ ఫోటోగ్రాఫర్ ప్రీతం మిత్రా చేసిన ఓ ఫోటోషూట్, ఆయనను హత్య చేస్తామని ఫోన్లు చేసి బెదిరించే వరకు వెళ్ళింది.

[m9ad]

ADVERTISEMENT

వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా ఖ్యాతి గాంచిన కోల్ కతాకు చెందిన ప్రీతం, ఓ మోడల్ ను పెళ్లికూతురు మాదిరి రెడీ చేయించి న్యూడ్ గా ఫోటోషూట్ నిర్వహించారు. సదరు మోడల్ కు సంబంధించిన సెన్సార్డ్ పార్ట్స్ ను ఏమీ ప్రదర్శించలేదు గానీ, బెంగాలీ మగువల సంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, హిందువులను కించపరచడమే ప్రీతం ఉద్దేశమని తీవ్రస్థాయిలో ఆగ్రహించారు.

సదరు ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల నుండి తక్షణం తొలగించకపోతే, హత్య చేస్తామంటూ బెదిరించడంతో… చివరగా అంతిమంగా ప్రీతం పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు ఆ ఫోటోషూట్ సంగతులు ఏంటి అంటూ ఆ మోడల్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories