బీజేపీ కి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కు ఫ్లవర్ ఇచ్చిన కోమటిరెడ్డి!

Komatireddy-Raj-Gopal-Reddy-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైన నాటి నుండు ఏ పార్టీ నేతలు ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటారో చెప్పలేని పరిస్తితికి నెలకొంది. టి.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై పలు విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కమలం గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ తాజాగా బీజేపీ పార్టీకి రాజీనామా చేసి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ సర్వేల నివేదికలు తేల్చి చెపుతున్నాయి. సర్వేల నివేదికలను పోల్చుకుంటూ నియోజకవర్గంలో గెలుపోటములను లెక్కలేస్తుకుంటూ, పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుని పార్టీల కండువాలను మార్చే పనిలో బిజీగా ఉన్నారు రాజకీయ నాయకులు.ఈ కోవలోకే వచ్చారు కోమటిరెడ్డి.

ADVERTISEMENT

మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని కమలం గుర్తుపై పోటీ చేసి ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న కోమటిరెడ్డి తిరిగి ప్రజాభిప్రాయానికి గౌరవం ఇస్తున్నా అంటూ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు.అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కు ఫ్లవర్ ఇచ్చిన కోమటిరెడ్డికి మునుగోడు ప్రజలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో వేచి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories