తెలంగాణా రాష్ట్ర సమితిలో కేటీఆర్ హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. అయితే ఇద్దరు దానిని ఖండిస్తూనే ఉన్నా ఇటువంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేటలో హరీష్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ రాజకీయ సన్యాసం గురించి ప్రస్తావించారు.
[m9ad]
రాజకీయాల్లో లేకుండా కూడా ప్రజాసేవ చెయ్యొచ్చు అంటూ ఊహాగానాలకు తావిచ్చారు. హరీష్ ఆ తరువాత ఖండించినా ఏదో జరుగుతుంది అనే భావన అందరిలోనూ ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితిలోని అసంతృప్త నేత, కొండా సురేఖ అగ్గికి ఆజ్యం పోశారు. మంత్రి హరీష్ రావు వర్గం అయినందునే తమను పక్కనబెట్టారని ఆమె అరోపించారు.
హరీష్ రావు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తమకు ఉన్న సమాచారం అని అన్నారు. నాలుగైదు రోజులలో తమ భవిష్యత్తు కార్చాయరణ చెబుతామని సురేఖ తెలిపారు. దీనితో హరీష్ రావు క్యాంపులో ఏం జరుగుతుంది అనే అనుమానాలు అందరికి కలుగుతున్నాయి. అయితే హరీష్ మాత్రం ఎప్పటిలానే వీటిపై అంతగా స్పందించడం లేదు.





