గులాబీ పార్టీలో రెబెల్స్ గుబులు

Konda Surekhacouple against TRSటీఆర్‌ఎస్‌లో అసమ్మతి జ్వాలలు హోరెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్‌ తరఫున అసెంబ్లీ టికెట్‌ దక్కని నేతలు తమ అసంతృప్తిని బహిరంగగానే వ్యక్తపరుస్తున్నారు. ఓ వైపు గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌లో చేరినవారికి ఈ సారి టికెట్‌ కేటాయించడంపై ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేనప్పటికీ మళ్లీ వారినే బరిలో నిలపడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన గుర్తింపు లభించడం లేదని మండిపడుతున్నారు. దీనితో కొందరు నేతలు వేరే పార్టీలలో జాయిన్ కావడానికి సిద్ధం అవుతుండగా, కొందరు రెబెల్స్ గా పోటీ చేస్తామని పార్టీని హెచ్చరిస్తున్నారు.

దీనితో ఇదంతా ఎక్కడకి దారి తీస్తుందో అని పార్టీ హై కమాండ్ ఆందోళనలో ఉంది. అవసరాన్ని బట్టి కొన్ని సీట్లలో అభ్యర్థులను మార్చే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. కొండా సురేఖ వంటి వారు కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనితో పార్టీ హై కమాండ్ అప్రమత్తం అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories