పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా ఏప్రిల్ 8వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ తేదీ దరిదాపుల్లో మరే చిన్న చిత్ర నిర్మాతలు తమ సినిమాల విడుదలలు ప్లాన్ చేసుకోవడం లేదు. కానీ అనూహ్యంగా తొలి సినిమాతోనే బాబాయ్ తో పోటీకి వస్తోంది కొణిదెల వారమ్మాయి నిహారిక.
ఫీల్ గుడ్ చిత్రంగా నిహారిక, నాగశౌర్య జంటగా రూపుదిద్దుకుంటున్న “ఒక మనసు” సినిమాకు ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ విడుదల ‘ఒక మనసు’ చిత్రానికి కలిసి వచ్చే అంశమే అంటున్నారు సినీ విశ్లేషకులు.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టాక్ ఎలా ఉన్నా, మొదటి మూడు రోజులు అభిమానులు ధియేటర్లకు పోటేత్తుతారు. ఈ సమయంలో బాబాయ్ సినిమాను చూడలేని వారు పక్కనే ఉన్న కొణిదెల వారి అమ్మాయిని చూసినా… ‘ఒక మనసు’ సినిమాకు అయిన బడ్జెట్ వచ్చేస్తుంది. అదే జనాలకు ఎక్కితే… ‘ఒక మనసు’ బడ్జెట్ రీత్యా, ‘సర్దార్’ను మించిన బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ప్లాన్ బాగానే ఉంది గానీ, అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి!



