రాజమౌళి తర్వాత వరుసగా సక్సెస్ లు అందుకుంటున్న దర్శకుడిగా కొరటాల శివకు “భరత్ అనే నేను” సినిమా తర్వాత యెనలేని కీర్తి ప్రతిష్టతలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా సెన్సిటివ్ కధలకు కమర్షియల్ కళాత్మకతను అద్భుతంగా హద్డుతోన్న కొరటాల శివ అభిరుచికి టాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఫిదా అవుతూ కొరటాలతో మూవీ కోసం ఎదురుచూస్తున్న రోజులు.
‘భరత్ అనే నేను’ సినిమాతో బాగా అలసిపోయానని, ఓ రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న తర్వాత తన కొత్త చిత్రం గురించి ఆలోచిస్తానని కొరటాల చెప్పిన విషయం తెలిసిందే. ఇక ‘భరత్ అనే నేను’ కూడా ఈ వారంతో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో…. కొరటాల కొత్త సినిమాపై పలు ఆసక్తికర కధనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కొరటాల సినిమా ఉంటుందన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా కొరటాల – మెగాస్టార్ కాంబో సిద్ధం అవుతోందని, ఈ సినిమాలో మెగాస్టార్ ఏకంగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ కు అసలైన పండగ వచ్చినట్లే. చిరుతో రాజమౌళి సినిమా చేయలేను అన్నారు గనుక, అలాగే సక్సెస్ లు కొడుతున్న కొరటాలతో చేస్తే మరో గ్రాండ్ సక్సెస్ గ్యారెంటీ అన్న దృక్పధం ఫ్యాన్స్ ది మరి!



