విజయవాడ మేయర్…వైసీపీ ఆశలన్నీ ఏబీవీ మీదేనా.?

Vijayawada mayor election and political contest

రాజకీయంలో ఒక్కోసారి సొంత పార్టీ గెలుపు కన్నా తన ప్రత్యర్థి పార్టీ ఓటమే కీలకంగా మారుతుంది. తమ పార్టీ గెలవకపోయిన పర్వాలేదు ప్రత్యర్థి పార్టీ ఓడితే చాలు అనేలా నాయకుల పొలిటికల్ మూవ్స్ ఉంటాయి.

ఇప్పుడు విజయవాడ మేయర్ పదవి పై వైసీపీ ఆ తరహా రాజకీయమే చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడ మేయర్ సీటు కోసం కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి వంగవీటి రాధ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో కూటమి బలానికి తోడు వంగవీటి బ్రాండ్ కూడా తోడవడంతో బెజవాడ వైసీపీ మేయర్ అభ్యర్థి ఎవరన్నదాని మీద భిన్న వాదనలే తెరమీదకు వచ్చినప్పటికీ వైసీపీ అనూహ్యంగా రాయన భాగ్యలక్ష్మి పేరు ప్రకటించింది.

వంగవీటి రాధ కు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ నేత రాయన భాగ్యలక్ష్మి గెలుపు మీద ద్రుష్టి పెట్టాల్సిన బెజవాడ వైసీపీ నేతలు ఆ విషయాన్ని పక్కన పెట్టి కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గెలుపు మీద ద్రుష్టి కేంద్రీకరించారు.

ఏబీవీ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బెజవాడ రాజకీయాలలో ఆ సామాజికవర్గం పాత్ర కీలకం కావడంతో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధ కు బదులు కమ్మ సామాజికవర్గం ఏబీవీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే ప్రచారం మొదలుపెట్టారు.

తద్వారా కూటమి ఓట్ బ్యాంకు కమ్మ – కాపు అనే రెండు సామాజికవర్గ సమీకరణ దృష్ట్యా చీలుతుందని అది వైసీపీ కి రాజకీయ మేలు చేయకపోయినా కూటమికి పొలిటికల్ నష్టం చేస్తుందనే భావనలో వైసీపీ మునిగితేలుతోంది. ఏబీవీ తన సామాజికవర్గ ఓటర్లను తనవైపు తిప్పుకోగలిగినట్లయితే అయితే వైసీపీ గెలుపుకి అవకాశం ఉంటుంది, లేదా కూటమి అభ్యర్థి ఓటమికి ఛాన్స్ దొరుకుతుంది అనే ఆశ అత్యాశ మధ్య వైసీపీ రాజకీయం తిరుగుతుంది.

విజయవాడ మేయర్ సీటు వైసీపీ కి దక్కపోయినా పర్లేదు కూటమి చేతికి చిక్కకూడదు అనేలా వైసీపీ స్థానిక నేతలు తెరవెనుక ఏవీబీ కి మద్దతు తెలుపుతున్నట్లుగా సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుంది. అందుకు బలం చేకూరేలా వైసీపీ మద్దతుదారుల సోషల్ మీడియా అకౌంట్లలో ఏబీవీ ఎన్నికల ప్రచారాలన్నీ హై లైట్ చేస్తూ పోస్ట్ లు వెలుస్తున్నాయి.

రాధ మీద రాయన గెలవడం అసాధ్యమని వైసీపీ ముందే గ్రహించడంతో తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కాకుండా ప్రత్యర్థి పార్టీ ఓటమి కోసం వైసీపీ లోపాయికారి పొత్తులతో ముందుకెళుతూ వంగవీటి ఓటమి కోసం ఏబీవీ తో చేతులు కలిపేందుకు కూడా వెనకాడడం లేదు అంటూ స్థానిక పొలిటికల్ సర్కిల్స్ లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ సమయంలో ఇదే ఏబీవీ మీద ఐదేళ్ల పాటు రాజకీయ కక్ష సాధించిన వైసీపీ ఇప్పుడే అదే ఏబీవీ కోసం ప్రచారం చేయడం, ఆయన పొలిటికల్ స్పీచ్ లను హై లైట్ చెయ్యడం ఏ దేవుని స్క్రిప్ట్ లో భాగమనాలో వైసీపీ నేతలే చెప్పాలి మరి…!

ADVERTISEMENT
Latest Stories