‘క్రియేటివ్ దర్శకుడు’ కృష్ణవంశీ పాటలను ఎంత అత్యద్భుతంగా చిత్రీకరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాటలలో హీరోయిన్లను అందంగా, సెక్సీగా చూపించడంలో కృష్ణవంశీ తర్వాతే ఎవరైనా… అన్న ఖ్యాతి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. అందుకే ఇతర దర్శకులు సైతం తమ సినిమాలలో కృష్ణవంశీ చేత పాటలను షూట్ చేయిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ‘స్వాగతం’ సినిమాలో అనుష్క అందాలను ఆవిష్కరించిన ఘనత కూడా కృష్ణవంశీకే సొంతమైంది. అలాంటి వంశీ తాజాగా “నక్షత్రం” అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రజ్ఞా జైస్వాల్ వ్వంటి తారామణులతో కూడిన ఈ సినిమా ఆడియోను బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. దీనిని ధృవీకరిస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. సందీప్ కిషన్ – రెజీనా జంట, సాయి – ప్రజ్ఞాల జోడి కన్నులవిందు చేస్తున్న ఈ పోస్టర్ లోనే కృష్ణవంశీ మార్క్ ఏంటో చూపించకనే చూపిస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా, పాటల చిత్రీకరణతో వంశీ మాయ చేస్తారేమో చూడాలి.



