తెరాస తెలుగు దేశంతో పొత్తు ప్రయత్నాలు చెయ్యలేదా?

KTRఒక టీవీ ఇంటర్వ్యూలో తెరాస తెలుగుదేశం పొత్తుకు ప్రయత్నించి బీజేపీ జోక్యంతో జరగలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. తెరాస, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం. కానీ కేంద్రం, ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఇటీవల చంద్రబాబు అన్నారు కదా? అని అడిగారు.

[m9ad]

ADVERTISEMENT

“మా ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టాలనుకునే చంద్రబాబుతో కలిసి ఎట్లా పనిచేస్తాం? తెలుగువారు కలిసుండాలి. కానీ, తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేసే వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు 30 ఉత్తరాలను ఉపసంహరించుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా?,” అని మంత్రి చెప్పుకొచ్చారు.

అదే ఇంటర్వ్యూలో “చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటేనే టీఆర్‌ఎస్‌ మంచిదా? పొత్తు పెట్టుకోకపోవడంతో కాంగ్రెస్‌తో ఆయన పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు,” అని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు తెరాస తెలుగు దేశంతో పొత్తు ప్రయత్నాలు చెయ్యలేదని కేటీఆర్ చెబుతున్నారా?

ADVERTISEMENT
Latest Stories