ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ వేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని చెపుతూ జనవరి 15కి వాయిదా వేసింది. కనుక ఈ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం లేన్నట్లే భావించవచ్చు.
ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో అధికారులు కేటీఆర్‌ని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్‌కి ఎటువంటి ఉపశమనం లభించలేదు కనుక నేడు విచారణ ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు ఆయనని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తనని ఈ తప్పుడు కేసులో ఇరికించారని కేటీఆర్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఇది తప్పుడు కేసా కాదా? అనే విషయం న్యాయస్థానాలు తెలుస్తాయి.
కానీ ఆనాడు ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి పట్టుకొని రాజకీయంగా దెబ్బతీయడానికి కేసీఆర్ ప్రయత్నించారు. ఆ కేసులో జైలుకి కూడా పంపారు. అప్పుడే కేసీఆర్‌ని కూడా ఇదే జైల్లో చిప్పకూడు తినిపిస్తానని రేవంత్ రెడ్డిశపధం చేశారు.
రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడే కూతురు పెళ్ళికి బెయిల్ తీసుకొని బయటకు రావలసి వచ్చింది. అప్పుడు కూడా సంతోషంగా కూతురు పెళ్ళి జరిపించుకునేందుకు అవకాశం ఈయకుండా కేసీఆర్ ఆయన పట్ల చాలా కక్షపూరితంగా వ్యవహరించారు.
కనుక ఆనాడు కేసీఆర్ చేసిన దానికి ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ మూల్యం చెల్లించక తప్పదు. సంక్రాంతి పండుగ సమయంలో కేటీఆర్‌ని జైలుకి పంపించడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం లేదు. ఎఫ్-1 రేసింగ్ కేసు గురించి ఒక్క ముక్క మాట్లాడక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.




