ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉండే వారిలో తెలంగాణా మంత్రి కేటీఆర్ ముందు వరుసలో ఉంటారు. అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి ట్విట్టర్ ను వేదికగా ఎంచుకున్న కేటీఆర్, తనదైన శైలిలో నెటిజన్లకు రిప్లైలు కూడా ఇస్తుంటారు. తాజాగా అలాంటి ఓ రిప్లైనే కేటీఆర్ లో చలోక్తుడ్ని బయటకు తెచ్చింది.
‘కేటీఆర్ కు శుభోదయం తెలుపుతూ… బాల్టిమోర్ నుండి ఆక్లాండ్ లో ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత, ఈ టైం ఎలా గడపాలా? అని ఆలోచించుకుని, మీ వీడియోలన్నీ ఆఫ్ లైన్ లో వరుసగా చూసాను, హ్యాపీ గురువారం’ అంటూ ఓ నెటిజన్ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయగా, దీనికి మంత్రి గారి నుండి సమాధానం లభించింది.
“నేను ఇంత వినోదాన్ని అందిస్తానని, టైం పాస్ చేపించగలనని నాక్కూడా తెలియదు, ఒకవేళ నేనే ఆ స్థానంలో ఉంటే గనుక, దానికి బదులుగా ఓ మంచి సినిమాను చూసి ఉండేవాడిని” అంటూ బదులిచ్చారు. రాజకీయ రంగంలో ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో వినోదాన్ని అందించడంలో కేటీఆర్ కింగ్ లా మారుతున్నారు.
I didn’t know I could be a source of entertainment/timepass 😀
If I were you, would’ve watched a nice movie instead 😎 https://t.co/C7sgHJzZEZ
— KTR (@KTRTRS) July 5, 2018



