ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” సినిమాను తెలంగాణా ముఖ్యమంత్రి తనయుడు, మంత్రివర్యులు అయిన కల్వకుంట్ల తారక రామారావు వీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు మంచి విజయం దక్కిందని నిర్మాత శరత్ మరార్ ను అభినందించారు. అలాగే హ్యండ్లూమ్స్ ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇందుకు గానూ పవన్, మరార్ లను ప్రశంసించారు కేటీఆర్.
అలాగే పవన్ తో కలిసి ఓ సెల్ఫీలో కనిపించాడు కేటీఆర్. సాధారణంగా సెల్ఫీ వంటి ట్రెండీ ఐటమ్స్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, ఇటీవల మాత్రం వరుసగా సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. తెలంగాణాలో కూడా తన ‘జనసేన’ ఉంటుంది, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తామని ఇటీవల స్పష్టం చేసిన నేపధ్యంలో… అధికార పార్టీ అధినేత తనయుడితో పవన్ సెల్ఫీ దిగడంపై రాజకీయంగా తెలంగాణాలో పవన్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.



