అలా తీసివుంటే..ఎలా ఉండేదో కదా!

NTR- Biopic-ఎన్ఠీఆర్ సినిమాని క్రిష్ ఒకే భాగంలో తీసేసి ఉంటే ఎలా ఉండేదో కదా…పైపైనే సింపుల్ గా ఎన్ఠీఆర్ సినిమాల్లో ఎలా జీవించాడో చూపించేసి…ఇక ఆ తర్వాత ఇంటర్వెల్ బాంగ్ కి టీడీపీ పార్టీ అనౌన్స్మెంట్ ఇచ్చి..కట్ చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం పొలిటికల్ గా పరిగెత్తించి ఉంటే..పాపం క్రిటిక్స్ కి సినిమా స్లో గా ఉంది అని రాసే బాధ తప్పి ఉండేది.

అయితే అదే జరిగి ఉంటే, సగటు ప్రేక్షకుడు ఎన్ఠీఆర్ అసలు కథానాయకుడు గా ఎలా ఎదిగాడో తెలియకుండా పోయేది..అయన ఎంత నిజాయితీ పరుడో మనకు తెలిసేది కాదు..ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే ఎన్ఠీఆర్ అనే ఒక వ్యక్తి మన తాతల…నానమ్మల చందమామ కధగా మిగిలిపోయేవాడు. కానీ క్రిష్ మంచి ఆలోచనే చేసాడు…

ADVERTISEMENT

ఎన్ఠీఆర్ పొలిటికల్ గా ఎన్ని ఎత్తు పల్లాలు చూశాడో మనం ఇప్పుడు 30 దాటిన జనరేషన్ మొత్తానికి తెల్సిందే. అయితే ఆయన సినిమా జీవితమే మనకు చరిత్ర…అందుకేనేమో నిడివి ఎక్కువైనా..కాస్త బోర్ అనిపిస్తుంది అని క్రిటిక్స్ అంటారు అని తెలిసినా క్రిష్ తొలి భాగాన్ని మొత్తంగా ఎన్ఠీఆర్ సినిమా చరిత్రకే పరిమితం చేసాడు..

ఇక నారా బ్రాహ్మణి చెప్పినట్లు అసలు కథ మహానాయకుడు లో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories