తప్పు లేదు..కొన్ని కాంట్రోవర్సియల్ సబ్జక్ట్స్ డీల్ చేస్తున్నప్పుడు ఆ కధకు సంభందించి కొన్ని నిజాలు చూపించాలి. అయితే మరీ దిగజారి ప్రవర్తించడం క్రియేటివ్ ఫీల్డ్ లో అంత సమర్ధత అనిపించుకోదు..దాని పర్యావసానంగా వారిని ఎవ్వరూ పట్టించుకోరు ఇప్పుడు ఆర్జీవీ సినిమాల లాగా.
[m9ad]
మ్యాటర్ ఏంటి అంటే ఒక పక్క ఎన్ఠీఆర్ బయోపిక్ పేరుతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటూ ఉంటే మరో పక్క లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమాలో ‘వెన్నుపోటు’ పాట అంటూ ఆర్జీవీ ఒక పాటను రిలీజ్ చేసాడు…ఆ పాట మొత్తంగా చూస్తే ఆర్జీవీలోని క్రియేటివ్ డైరెక్టర్ మూగబోయి..ఒక వ్యక్తిపై కారణం లేని ద్వేషాన్ని నింపుకున్న మరో ఆర్జీవీ కనిపిస్తున్నాడు. పైగా ఆయన ఉపయోగించిన స్లైడ్స్ కూడా ఎన్ఠీఆర్..చంద్రబాబుతో కలసి ఉన్నవే.
అయితే జరిగిన కథను తెరకెక్కించాలి అంటే..జుగుత్స కలిగించే విధంగా ప్రమోట్ చెయ్యాలా? మరీ అంత దిగజారిన ఆలోచనలతో సినిమాను తెరకెక్కించాలా? అసలు ఆర్జీవీ అంటే ఒకప్పుడు కొత్తదనానికి సరికొత్త నిర్వచనం చెప్పిన వాడు..కానీ ఇప్పుడు ఈ చద బట్టిన చరిత్రను చెత్తగా తెరకెక్కిస్తూ…మరింత చెత్తగా మారుతున్నాడు..
ఇప్పటివరకూ ఆయన తీసిన ప్రతీ చరిత్రలో నిజం లేక పోగా…అదో రకమైన పైశాచికం కనిపిస్తుంది అని ఫీల్ అవుతున్నారు ఆయన సినిమాలను ఇష్టపడే వారు…ఏది ఏమైనా..ఆర్జీవీ కాస్త మారాలి మీరు.



