‘సర్ధార్’తో ఉంటే ఆ ‘సరదా’నే వేరు!

lakshmi rai about pawan sardaar gabbar singh songపవర్ స్టార్ సినిమాలో ఒక చిన్న రోల్ దక్కినా చాలు అనుకునే హీరోయిన్లకు కొదవలేదు. అయితే తొలుత ఒక స్పెషల్ సాంగ్ లోకి తీసుకున్న లక్ష్మీ రాయ్ కు సినిమాలో ఒక చిన్న పాత్ర కూడా దక్కడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని రీమిక్స్ సాంగ్ లో నర్తించిన ఈ భామ మల్లెపూలు పట్టుకుని ఉన్న స్టిల్స్ మాస్ వర్గాల్లో సెగలు రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించడం పట్ల తన అనుభూతులను చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్ లో తాను చాలా ఎంజాయ్ చేశానని, ఈ చిత్రంలో నటించడం వల్లే పవన్ కల్యాణ్ లాంటి మంచి వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం తనకు దొరికిందని, తనకు చాలా సంతోషంగా ఉందని, సర్ధార్ తో ఉంటే ఆ సరదానే వేరు అన్న రీతిలో పవన్ గురించి చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఆడియో ఈ నెల 20వ తేదీన అంగరంగ వైభవంగా విడుదల కావడానికి సిద్ధమవుతుండగా, సినిమా వచ్చే నెల 8వ తేదీన విడుదల కానుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories