లావణ్య “స్కిన్ షో” జ్ఞానోదయం అయినట్లేగా!

Lavanya Tripathi - Radhaకెరీర్ ఆరంభమైన “అందాల రాక్షసి” సినిమా నుండి మొన్నటి “శ్రీరస్తు శుభమస్తు” వరకు అనేక సక్సెస్ లు అందుకున్న లావణ్య త్రిపాఠి, ఇటీవల తనకొస్తున్న పాత్రలపై ఆవేదన వ్యక్తం చేస్తూ కొన్ని కీలకమైన ప్రకటనలు చేసింది. సహజంగా సినీ ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ కు దూరంగా హీరోయిన్లకు సక్సెస్, కీర్తి ప్రతిష్టలు రావడం బహు అరుదు. కానీ అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నప్పటికీ, లావణ్యకు అంతులేని అసంతృప్తి ఉందన్న విషయాన్ని ఇటీవల బయటపెట్టింది.

“తనకు అన్ని ఒకే రకమైన పాత్రలు వస్తున్నాయని, అందులోనూ ఒకే తరహా కాస్ట్యూమ్స్ ధరించి విసిగిపోయి ఉన్నానని, తనకు మోడ్రన్ కాస్ట్యూమ్స్ ధరించాలని ఉందని, అందుకు తాను కూడా సిద్ధమనేని, స్కిన్ షోకు తనకేమీ అభ్యంతరం లేదన్న సంకేతాలను” స్పష్టంగా చెప్పింది. సంప్రదాయపు పాత్రల్లో లావణ్యను చూసి ఉన్న ప్రేక్షకులకు కూడా ఇదొక బంపర్ ఆఫర్ లా తగిలింది. అయితే అప్పటికే సెట్స్ పైన ఉన్న “రాధ” సినిమాలో లావణ్య అందాలు ఆరబోసిన విషయం అప్పటికీ ప్రేక్షకులకు తెలియదు.

ADVERTISEMENT

ఇటీవల విడుదలైన ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించిన లావణ్యతో పాటు, కాస్త గ్లామర్ డోస్ ను పెంచింది. కురచ దుస్తుల్లో స్లిమ్ గా కనిపించింది గానీ, లావణ్యకు దక్కాల్సిన పేరు ప్రఖ్యాతలు మాత్రం దక్కలేదు. దీంతో సక్సెస్, కీర్తి ప్రతిష్టలు అనేవి గ్లామర్ షోలో గానీ, స్కిన్ షోలో గానీ లేదన్న విషయం లావణ్యకు జ్ఞానోదయం అయినట్లేగా! అలాగని ఈ అందాల ప్రదర్శనతో కనీసం యూత్ కైనా దగ్గరైందా? అంటే అది కూడా లేకపాయే! స్లిమ్ గా మారడంతో కురచ దుస్తుల్లో బక్కచిక్కిన కోడిలా విమర్శలకు గురయ్యింది లావణ్య.

ADVERTISEMENT
Latest Stories