సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి వర్ణనాతీతం అన్న విషయం ఇటీవల వెలుగుచూస్తున్న ఇంటర్వ్యూల ద్వారా స్పష్టమవుతోంది. ‘కో-ఆపరేటివ్… కాస్టింగ్ కౌచ్… అడ్జెస్ట్ మెంట్…’ ఇలా పేర్లు వేరైనా వాటి ఆంతర్యం మాత్రం ఒక్కటేనని అర్ధమవుతుంది. మరి ఇలాంటి సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు దాదాపుగా ఏడెనిమిది సినిమాలు చేసినా, ఒక్క సినిమాలో కూడా అందాల ప్రదర్శనకు తావు లేకుండా నటిస్తోన్న లావణ్య త్రిపాఠి, తాజాగా తన కాస్ట్యూమ్స్ విషయంలో ఆవేదనను వెలిబుచ్చుకున్న విషయం తెలిసిందే.
ఎప్పుడూ ఒకే రకమైన లంగా, వోణీ డ్రెస్సులను ధరించి విసుగొస్తోందని, తన నిజ జీవితంలో మోడ్రన్ కాస్ట్యూమ్స్ ను దరించడానికే తాను ఇష్టపడతానని చెప్పిన లావణ్య, సినిమాలలో గ్లామరస్ పాత్రలను పోషించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చింది. హోమ్లీ బ్యూటీ అన్న ట్యాగ్ లైన్ కే పరిమితం కాదలుచుకోలేదని, అయితే గ్లామర్ పాత్రలు అంటే బట్టలు విప్పేసే న్యూడ్ గా నటిస్తానని కాదని, తనకు ఇబ్బందికరంగా లేని ఆధునిక వస్త్రాలలో కనపడతానని మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.
సహజంగా హీరోయిన్లు గ్లామరస్ పాత్రలతో బోరు కొట్టింది, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు కావాలంటూ మొరపెట్టుకుంటుంటారు. కానీ లావణ్య విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండడం విశేషం. మరి లావణ్యలోని ఆ గ్లామరస్ యాంగిల్ ను వెలికితీసే దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యాఖ్యల తర్వాత లావణ్య ఫేట్ మారే అవకాశాలు ఉన్నాయని, భారీ సినిమాల అవకాశాలు దక్కవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.



