గ్లోబల్ సినిమాలు తీద్దాం సారూ స్టార్ల సంగతి తర్వాత

Ntr Ram Charan RRRఒకపక్క తెలుగు సినిమా దేశాల సరిహద్దులు దాటి ఆస్కార్ మెట్లకు దగ్గరగా వెళ్ళింది. గెలిచినా ఆశ్చర్యం లేదు. దీనికి ఆనందించాలో లేక హీరోలకు అండగా ఉండాల్సిన అభిమానులు ట్యాగులు బిరుదుల వ్యామోహంలో పడి సోషల్ మీడియాలో పరువును విదేశీయుల ముందు తీస్తున్నందుకు బాధపడాలో అంతు చిక్కడం లేదు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ కు అయిదు అవార్డులు ప్రధానం చేశాక అసలైన యుద్ధం ట్విట్టర్ లో మొదలైంది. రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ చేసేందుకు అభిమానులు నడుం బిగించారు. ట్రిపులార్ లో హీరో అతనే అనే రేంజ్ లో ట్రెండింగ్ మొదలుపెట్టారు.

నిజానికి చరణ్ తారక్ లలో ఎవరు గొప్పగా నటించారనే పోలికే అనవసరం అర్థరహితం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి ఏవి సూట్ అవుతాయో వాటిని సరిగ్గా ఒడిసిపట్టుకుని రామరాజు భీమ్ లను చూపించారు రాజమౌళి. జస్ట్ ఇద్దరూ ఒకవేళ రివర్స్ పాత్రలు చేసుంటే అనే ఊహే అదోరకంగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరి క్యాలిబర్ వాళ్ళది ఎవరి నటన వాళ్ళది. ఎప్పుడూ ఒక నటుడి వల్ల మార్కెట్ పెరుగుతుందేమో కానీ సినిమా స్థాయి పెరగదు. ఎలా అంటే కమల్ హాసన్ ఎంత గొప్ప వర్సటైల్ యాక్టర్ అయినా నాయకుడు, భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత అన్నీ అలాంటి ఫలితాలే అందుకోలేదు. పవన్ అయినా మహేష్ అయినా అందరికీ ఇది వర్తిస్తుంది.

ADVERTISEMENT

సో ఇక్కడ నటీనటుల కన్నా ముందు ఎలివేట్ అవ్వాల్సింది సినిమాలు. ఒకప్పుడు ఇండియన్ మూవీ అంటే చులకనగా చూసే కాలం నుంచి జపాన్ లో మన తెలుగు చిత్రం వంద రోజులకు పైగా హౌస్ ఫుల్స్ తో ఆడే రేంజ్ కి వచ్చేశాం. ఇలాంటివి మరెన్నో రావాలి. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ కొత్త సిరీస్ వచ్చినప్పుడు మనం ఎంత ఉత్సాహంతో టికెట్లు కొనేందుకు ఎగబడతామో అలాగే అమెరికన్లు మన కొత్త రిలీజులు వచ్చినప్పుడు యుఎస్ మల్టీప్లెక్సుల దగ్గర క్యూలు కట్టాలి. యుకె దుబాయ్ లాంటి దేశాల్లో థియేటర్లు కిక్కిరిసిపోవాలి. అది రాజమౌళి ఒక్కరి వల్లే అవ్వదు. త్రివిక్రమ్, సుకుమార్, లోకేష్ కనగరాజ్ ఇలా అందరూ నడుం బిగించాలి.

అంతే తప్ప కేవలం హీరోల గొప్పల మీద డప్పులు కొట్టుకుంటే అది కేవలం తాత్కాలికమే అవుతుంది. న్యూ జనరేషన్ మేకర్స్ కి ప్రోత్సాహం దక్కాలి. అది క్షేత్ర స్థాయిలో సోషల్ మీడియాలోనే మొదలవ్వాలి. అంతే తప్ప చరణ్ నో తారక్ నో సపోర్ట్ చేస్తున్న ఫారినర్స్ ని ట్రోల్ చేయడం వల్ల మరింత చులకన కావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. బాలీవుడ్ ఒక్క పఠాన్ తో వెయ్యి కోట్లు వచ్చాయని మూడేళ్ళ కరువుని మర్చిపోయి తొడలు కొడుతోంది. కరోనా తర్వాత రొట్ట రొటీన్ కంటెంట్ తోనూ వందల కోట్ల సినిమాలు ఎన్నో ఇచ్చిన సౌత్ సినిమా ఆర్ఆర్ఆర్ లాంటి గర్వపడే కంటెంట్ ని తీస్తే ఇంకేస్థాయిలో అద్భుతాలు జరుగుతాయో చెప్పాలా.

ADVERTISEMENT
Latest Stories