“లోఫర్” ధియేటిరికల్ ట్రైలర్ టాక్ – 10 రోజులు ఆగాలి!

loafer thearetical trailerపూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన “లోఫర్” సినిమా ఆడియో విడుదలైంది. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఆడియో అటుంచితే, ఈ సందర్భంగా విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ సినిమాపై ఎటువంటి అంచనాలను పెంచలేకపోయింది. ట్రైలర్ వీక్షించిన తర్వాత ఖచ్చితంగా ‘సూపర్’ అని చెప్పలేం గానీ… చెప్పుకోవడానికి ఏమీ లేదనైతే చెప్పవచ్చు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చెప్పాలంటే… మరో 10 రోజుల్లో (డిసెంబర్ 18న) విడుదల కాబోయే సమయం వరకు వేచి చూడాల్సిందే.

పూరీ మార్క్ రొటీన్ హీరోయిజం డైలాగ్స్ ను పక్కన పెడితే, ఈ ట్రైలర్ లో వచ్చే చివరి సీన్ (రేవతి చెప్పిన డైలాగ్) “లోఫర్” కధను చెప్తోంది. ‘మదర్’ సెంటిమెంట్ ప్రధానంగా ‘లోఫర్’ రుపుదిద్దుకుందని డైరెక్టర్ పూరీ స్పష్టం చేయడం అనేది … మెగా అభిమానులను మానసికంగా సిద్ధం చేసేందుకే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ముకుంద, కంచె’ వంటి హాఫ్ బీట్ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ ను కమర్షియల్ యాంగిల్ లో చూడాలనుకునే వారిని మాత్రం ఈ చిత్రం సంతృప్తి పరిచే విధంగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories