వారానికి ఖచ్చితంగా మూడు, నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి సినిమాను చూడడం సినీ ప్రేక్షకుల వల్ల కాదు. కానీ తమ సినిమాను చూడాలనిపించే విధంగా ప్రమోషన్స్ చేయడం మాత్రం దర్శకనిర్మాతల ప్రణాళిక. ప్రస్తుతం పబ్లిసిటీ కీలకపాత్ర పోషిస్తున్న తరుణంలో “లండన్ బాబులు” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వీక్షకులను అమితంగా అలరిస్తున్నాయి.
ఇటీవల యాడ్ విభాగంలో బాగా పాపులర్ అయిన జాబితాలో ‘లలితా జూయలర్స్’ ప్రధమ స్థానంలో నిలుస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రయోగాలు కూడా చేసి వీక్షకులకు కామెడీని పంచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఈ యాడ్ స్పూర్తితోనే “లండన్ బాబులు” సినిమా ప్రమోషన్ ప్రోమోను తీర్చిదిద్ది విడుదల చేయగా, అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
“మా సినిమా ట్రైలర్ తో మిగిలిన సినిమాల ట్రైలర్స్ కంపేర్ చేయండి… నచ్చితే దగ్గరలో ధియేటర్లో ‘లండన్ బాబులు’ చూడండి… డబ్బులు అంత ఈజీగా రావు…” అంటూ చేసిన ఈ యాడ్ హాస్యాన్ని పండించడంలో సక్సెస్ సాధించింది. నెటిజన్ల ఆసక్తిని రాబట్టడంలో సఫలమైన ఈ సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల 17వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.
😂😂😂😂😂 super seenu @SKNonline @elurucnu #LondonBabulu pic.twitter.com/HsGQDvu6Mk
— Phani Kandukuri (@buduggadu) November 12, 2017
Ha ha ha crazyyyyy#Londonbabulu Nov 17th Release promo is Hilirious
Check out why 😁 & share pic.twitter.com/AMFizaM6zD— SKN (@SKNonline) November 12, 2017



