కాస్టింగ్ కౌచ్ – ఓ నిర్మాత భార్యే నన్ను అడిగింది!

lyric writer shreshta opens on casting couchlyric writer shreshta opens on casting couch“అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు” తదితర చిత్రాల్లో పాటలు రాసి మంచి రచయితగా పేరు తెచ్చుకున్న శ్రేష్ఠ తాజాగా వెబ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘కాస్టింగ్ కౌచ్’పై షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని, తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని, ఆ కారణంగానే తాను చిత్ర రంగంలోకి రావడాన్ని చాలాసార్లు వాయిదా వేసుకున్నానని వివరించింది. పురుషులతో పాటు మహిళలు కూడా క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడుతున్నారని తెలిపింది.

ADVERTISEMENT

స్వయంగా ఓ నిర్మాత భార్య తనను కలిసి, ఆమె భర్త వద్దకు వెళ్లాలని కోరిందని చెప్పారు. అలాగే ఓ వ్యక్తి తనపై మనసు పారేసుకున్నాడని, గోవాలో పార్టీ ఇస్తున్నాడని, అక్కడికి వెళ్లాలని ఓ మహిళా దర్శకురాలు డిమాండ్ చేసిందని తెలిపింది. అయితే ఆ పార్టీకి తాను వెళ్ళకపోవడంతో, దీంతో సదరు వ్యక్తి తనకు ఫోన్ చేసి చెడామడా తిట్టాడని వాపోయింది. నిస్సహాయురాలినైన తాను వారితో విభేదించి, కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యానని తన వ్యధను వెలిబుచ్చింది.

ADVERTISEMENT
Latest Stories