కేసీఆర్ సినిమాకు డబ్బుల ప్రాబ్లమట

Producer-Director-Ready-with-Pan-Indian-KCR-Biopicచిన్న సినిమాలను నిర్మించి… వాటిని తెలివిగా మార్కెట్ చేసే నిర్మాత మధురా శ్రీధర్. తక్కువ ఖర్చులో సినిమాలు తీసి వాటిని తెలివిగా మార్కెట్ చేసి కాసులు రప్పించుకుంటారు ఆయన. అయితే ఆయన డ్రీం ప్రాజెక్టుకి బడ్జెట్ ప్రాబ్లమ్ వచ్చిందట. ఒక ఇంటర్వ్యూలో శ్రీధర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీధర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న అతికొద్ది మంది తెలంగాణ ఫిలిం మేకర్స్ లో ఒక్కరు. ఈ ప్రాజెక్టు గురించి ఆయన గతంలోనే ప్రకటించినా ఎందుకనో ఇప్పటివరకూ తెరకెక్కించలేక పోయారు. దానికి కారణాన్ని ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఈ ప్రాజెక్టుకు 20 కోట్ల బడ్జెట్ అవసరమని, ఇది ప్రాజెక్టును ఆలస్యం చేస్తోందని ఆయన అన్నారు.

ADVERTISEMENT

“నేను చాలా కాలంగా కెసిఆర్ బయోపిక్ ప్లాన్ చేస్తున్నాను. స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. కెసిఆర్ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నాయకుడు. అతని బయోపిక్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. దీనికి సుమారు 20 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్ కారణంగా మాత్రమే మేము ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టాము,” అని ఆయన చెప్పుకొచ్చారు.

“అవరోధాలు అన్ని తొలగిపోతే త్వరలో బయోపిక్ చేస్తాము. తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఈ సినిమా తీస్తాను “అని మధుర శ్రీధర్ వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ తరువాత మధురా శ్రీధర్ తో సినిమా చేసేందుకు అనేక మంది ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. చూద్దాం సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో?

ADVERTISEMENT
Latest Stories