లిప్ లాక్ లతో మూడు బడా ఆఫర్లు దూరం!

Madonna Sebastian no to lip lock scenesసూపర్ హిట్ మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో ఒక్కసారిగా పాపులర్ అయిన కేరళ భామ మడోనా సెబాస్టియన్, తాను లిప్ లాక్ సీన్లకు అంగీకరించకపోవడంతో మూడు పెద్ద చిత్రాల్లో నటించే చాన్స్ ను పోగొట్టుకున్నానని చెప్పింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూడో సినిమాలో నటిస్తున్న ఈ భామ, ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విశేషాలు చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తనది 5 నిమిషాల పాత్రే అయినా, అది ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని, మలయాళంతో పాటు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నానని, భాష సమస్య రాలేదని తెలిపింది.

ADVERTISEMENT

లిప్ కిస్ సీన్లకు తాను వ్యతిరేకమని, అటువంటి సీన్లలో నటించేందుకు రెడీగా లేనని చెప్పిన ఆమె, తొలిసారి కౌగిలింత సీన్ చేసేందుకు ఏడ్చేశానని అంది. తనకు బిడియం ఎక్కువని, బయటివారితో మాట్లాడేందుకు భయపడే రకాన్నని వెల్లడించింది. పురుషులతో పాటు స్త్రీలను కూడా సమానంగా గౌరవించే సమాజాన్ని తాను కోరుకుంటానని చెప్పింది. ప్రేమ వ్యవహారం తన వ్యక్తిగత అంశమని, దానిపై బహిరంగ వ్యాఖ్యలు చేయనని చెప్పిన ఈ భామ, తెలుగు ‘ప్రేమమ్’లోనూ తళుక్కుమన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories