సమంత వెంటపడుతున్న మహేష్ బాబు!

mahesh babu behind samantha ruth prabhu in brahmostavamప్రిన్స్ మహేష్ బాబు హీరోయిన్ల వెంటపడే సన్నివేశాలను అభిమానులు బహు అరుదుగా వెండితెరపై వీక్షించి ఉంటారు. ‘దూకుడు’ సినిమాలో సమంత వెంటపడిన మహేష్ తాజాగా మరోసారి సమంతనే ఎంచుకున్నారు. “బ్రహ్మోత్సవం” సినిమాలో ఉన్న కాజల్, సమంత, ప్రణీత ముగ్గురు ముద్దుగుమ్మలలో ‘కుందనపు బొమ్మ’కే ప్రిన్స్ ఓటు వేసాడు.

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ‘లేస్’ తింటూ ఉన్న సమంత వెనుక ప్రిన్స్ పరిగెడుతున్న ఫోటోలను అభిమానులు షేర్ చేసుకుంటూ హంగామా సృష్టిస్తున్నారు. వారణాసిలో జరుగుతున్న పాట చిత్రీకరణలో భాగంగా ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. సింపుల్ కాస్ట్యూమ్స్ లో ఉన్న ప్రిన్స్ ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరో కోణంలో ప్రతిబింబిస్తున్నారని అర్ధమవుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories