మహేష్ “బ్రహ్మోత్సవం” తేదీలు ఫిక్స్ అయ్యాయా?

Differences between Mahesh babu and Srikanth addalaశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. ప్రిన్స్ తో పాటు సమంత చిత్ర ముఖ్య తారాగణం అంతా పాల్గొన్న ఈ షెడ్యూల్ ఈ నెల 12వ తేదీతో ముగియనుంది. తదుపరి ఉత్తరాదిలోనే ఒక్క పాత మినహా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి రానుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల అవుతుందనుకున్న సినిమా కాస్త మే మాసానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తవుతుండడంతో మే మొదటి వారానికల్లా “బ్రహ్మోత్సవం” సిద్ధమవుతుందనే టాక్ వినపడుతోంది. ఏప్రిల్ 20వ తేదీన ఈ సినిమా ఆడియోను, మే 6వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రిన్స్ సరసన తొలిసారిగా ముగ్గురు ముద్దుగుమ్మలు సమంత, కాజల్, ప్రణీతలు నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. శ్రీకాంత్ అడ్డాల ట్రేడ్ మార్క్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఉన్నత కుటుంబ విలువలతో నిండుకుని ఉంటుందని టాక్.

ADVERTISEMENT
Latest Stories