‘వికీపిడియా’ కూడా ‘బ్రహ్మోత్సవం’ను ఆడేసుకుంటోందిగా..!

mahesh babu brahmostavam indian expressసక్సెస్ వచ్చినప్పుడు ఎన్ని ప్రశంసలు లభిస్తాయో… ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు అన్నే రాళ్లు మీద పడతాయని… “బ్రహ్మోత్సవం” సినిమా నిరూపిస్తోంది. ఒక జాతీయ దినపత్రిక నుండి, స్థానిక రాజకీయ నేతల వరకు సాగిన ‘బ్రహ్మోత్సవం’పై సెటైర్లు, కౌంటర్లు, ప్రతీకారాలు… తాజాగా అంతర్జాతీయ ‘వికీపిడియా’ కూడా ‘బ్రహ్మోత్సవం’ను ఒక ఆట ఆడేసుకుంటోంది.

2016లో విడుదలైన హార్రర్ సినిమాల జాబితా గురించి సెర్చ్ చేస్తుంటే, ఆ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాలల “బ్రహ్మోత్సవం” సినిమా కూడా ఉండడం విశేషం. దెయ్యాలు, భూతాలు ఉండే హార్రర్ సినిమాల జాబితాలో ‘బ్రహ్మోత్సవం’ను చేర్చారంటే… బహుశా పొరపాటుగా జరిగి ఉండొచ్చు గానీ, ‘బ్రహ్మోత్సవం’ అందించిన ఫలితానికి సరితూగడంతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.

ADVERTISEMENT

‘వికీపిడియా’ అందించిన ఈ సమాచారాన్ని స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో… అది సర్క్యూలేట్ అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల తన జోనర్ ను మార్చుకుని, ఫ్యామిలీ నుండి హార్రర్ సినిమాలకు వెళ్ళాడని, అలాగే మహేష్ కూడా ఒక భయపెట్టే సినిమా చేసాడని… ఇలా రకరకాలుగా ‘బ్రహ్మోత్సవం’పై పడుతున్న కౌంటర్లకు కొదవలేదు. అయితే ‘పడ్డ వాడెప్పుడూ చెడ్డవాడు కాడు’ అంటూ సూక్తులు చెప్పుకుంటూ… తమ సమయం వచ్చే వరకు వేచి చూడడం ప్రిన్స్ అభిమానుల వంతయ్యింది.

ADVERTISEMENT
Latest Stories