అదిరిపోయిన మహేష్ – అనుష్క పోస్టర్లు!

mahesh babu brahmotsavam red shirt picప్రిన్స్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ హంగామా మొదలైంది. మోషన్ పిక్చర్ తో మొదలైన సందడి ఆడియో విడుదల వరకు కొనసాగేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లుగా కనపడుతోంది. మోషన్ పిక్చర్ తర్వాత సమంత పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్, తాజాగా మహేష్ బాబు ఉన్న మరో పోస్టర్ ను విడుదల చేసింది. రెడ్ టీ షర్టులో ప్రిన్స్ ఉన్న స్టిల్ అభిమాన వర్గాలను ఆకట్టుకుంటోంది. కలర్ ఫుల్ గా డిజైన్ చేసిన పోస్టర్లు సినిమా తీరును ప్రతిబింబించేలా కనపడుతున్నాయి.

ఇక, బాలీవుడ్ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు తెరలేపింది అనుష్క శర్మ పోస్టర్. ఈద్ కానుకగా విడుదల కానున్న సల్మాన్ ఖాన్ “సుల్తాన్” సినిమాకు సంబంధించి ఇప్పటికే కండల వీరుడు లుక్ ను విడుదల చేయగా, తాజాగా అనుష్క శర్మ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఒక బలశాలిని ఎత్తి పడేసే విధానంలో ఉన్న అనుష్క లుక్ బాలీవుడ్ సినీ ప్రియులకు అదిరిపోయే ‘కిక్’ ఇస్తోంది. సల్మాన్ పోస్టర్ మాదిరే అనుష్క పోస్టర్ పై కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ADVERTISEMENT

sultan anushka pic

ADVERTISEMENT
Latest Stories