ఈ చేంజ్ బాగుంది ప్రిన్స్!

Mahesh babu changed dressing styleసినీ వేడుకలపై గానీ, ఇతర ప్రైవేటు ఫంక్షన్స్ లో గానీ మహేష్ బాబు ధరించే కాస్ట్యూమ్స్ కలర్స్ చాలా సెలక్టివ్ గా ఉంటాయి. ఇన్ని సంవత్సరాలలో మహా అయితే ఓ నాలుగైదు రంగుల షర్టులను మాత్రమే ధరిస్తూ ప్రిన్స్ దర్శనమిచ్చారు. ఎక్కువగా బ్లూ, గ్రే కలర్ షర్ట్స్ లో కనిపించే ప్రిన్స్ అప్పుడప్పుడు బ్లాక్, వైట్ కలర్స్ లలో కూడా కనపడుతుంటారు. కానీ మొదటిసారిగా ‘భరత్ అనే నేను’ థాంక్యూ మీట్ లో విభిన్నంగా దర్శనమిచ్చారు.

ADVERTISEMENT

బ్లాక్ అండ్ గ్రే కలర్ మోడ్రన్ టీ షర్టుతో పాటు ట్రెండీ ప్యాంట్ తో మహేష్ కనిపించడం కొత్తగా ఉంది. సిల్వర్ స్క్రీన్ పైన తప్ప సాధారణంగా ఇలాంటి కాస్ట్యూమ్స్ ను ప్రిన్స్ ప్రిఫర్ చేయరు. ‘భరత్ అనే నేను’ ఫలితం మహేష్ కు ఎంతటి ఆనందాన్ని పంచిందో చెప్పడానికి నిదర్శనంగా ఈ కాస్ట్యూమ్స్ ను ధరించారో ఏమో గానీ, యధావిధిగా ప్రిన్స్ మెరిసిపోయాడు. మహేష్ నుండి ఈ చేంజ్ నే అభిమానులు కూడా ఆశిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories