దర్శకులే కాదు..హీరోలు కూడా నిర్మాతలే!

mahesh babu entering into web seriesదర్శకుల్లో సుకుమార్ మొదలుకొని …తాజాగా కొరటాల శివ సైతం నిర్మాతగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు..స్నేహితులతో కలసి సినిమాలు చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. అయితే దర్శకులే కాదు హీరోలు కూడా నిర్మాతలుగా మారడానికి ఉత్సాహంగా ఉన్నారు…

[m9ad]

ADVERTISEMENT

చిరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పుడు బడా నిర్మాతలు చాల మంది సినిమా చెయ్యాలి అని క్యూ కడితే చెర్రీ తానే నిర్మాతగా మారి సినిమా తీసాడు…ఇప్పుడు చిరు సైరా కూడా తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..

ఇక తండ్రి కథను భావి తరాలకు అందించాలి అన్న ఆలోచనతో నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా ఎన్.బీ.కే ఫిలిమ్స్ అంటూ నిర్మాతగా మారాడు..ఇక ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు..

హీరోగా..బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న ప్రిన్స్…తాజాగా మల్టీ ప్లెక్స్ రంగంలోకి ఆడుకు పెట్టిన విషయం తెలిసిందే…అయితే ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకు వేసి వెబ్ సిరీస్ ను తెరకెక్కించాలి అని..అదే క్రమంలో చిన్న సినిమాలను తెరకెక్కించాలి అని ప్రిన్స్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం..

మరి హీరోలే నిర్మాతలుగా మారుతున్న తరుణంలో భవిష్యత్తు సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories