సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ప్రీ-లుక్ పోస్టర్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల అవుతుంది. చాలా కాలంగా మహేష్ బాబు లుక్స్ బోర్ గా ఉంటున్నాయి. గతం మూడు నాలుగు సినిమాల స్టిల్స్ చూస్తే ఒక్కోసారి మాములు వారికి ఏది ఏ సినిమా అని పోల్చుకోవడం కష్టమయ్యే పరిస్థితి.
అటువంటిది ఈ చిత్రంలో లుక్ చాలా కొత్తగా ఉంది. సరికొత్త హెయిర్ స్టైల్, చెవికి పోగు, మెడ మీద టాటూ తో మహేష్ గతంలో ఖలేజా, అతిథి టైంలో మహేష్ బాబులా కొత్తగా కనిపించాడు. దర్శకుడు పరశురాం తన కేరీర్ లోని అతిపెద్ద అవకాశాన్ని బాగానే వాడుకున్నాడు ఇప్పటికైతే.
సినిమాలో కూడా అటువంటి వెరైటీ చూపించగలిగితే తన మొదటి వంద కోట్ల షేర్ కొట్టేసినట్టే. మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, సంస్థలు కలిసి సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ జూన్-చివరన లేదా జూలై ఆరంభం నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని ఉగాది 2021 కోసం విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. అప్పటికి ఆర్థిక మందగమన ప్రభావం తగ్గుతుంది మరియు సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ ద్వారా ఈ చిత్రం కూడా సహాయపడుతుందని వారి ఆలోచన.



