టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు – వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలకు ఏమైనా సంబంధముందా? అన్న ఆలోచనకు రావాల్సిన అవసరం లేదు. మెగా నిర్మాత అశ్వనీదత్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా సినీ, రాజకీయ అతిరధ మహరధులతో పాటు మహేష్ బాబు, జగన్ మోహన్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. అయితే కాకతాళీయంగా ఇద్దరూ ఒకే ‘కలర్’ షర్టుతో దర్శనమిచ్చారు.
హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు మహేష్ బాబు సతీసమేతంగా హాజరు కాగా, జగన్ తన పార్టీ వర్గీయులతో విచ్చేసారు. ఇద్దరూ ఒకేసారి కలవకపోయినప్పటికీ, “బ్లూ” కలర్ షర్టుతో ఉన్న ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరో విశేషమేమిటంటే, జగన్ మరియు సూపర్ స్టార్ కృష్ణలు పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. మొత్తానికి జగన్ హాజరైన ప్రతి సమయంలోనూ ఏదొక రూపేణా వార్తల్లో నిలుస్తున్నారు.
ADVERTISEMENT





