బాబుని ఇలా చూడాలనుకోవట్లేదు!

Mahesh Babu Look With Beard And Long Hair

సూపర్ స్టార్ మహేష్ బాబుని జక్కన్న ఎలా చెక్కుతారో అని అభిమానులతో సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళికున్న ట్రాక్ రికార్డు రీత్యా భారీ అంచనాలు నెలకొన్న నేపధ్యంలో, ఫస్ట్ లుక్ అండ్ ప్రెస్ మీట్ కోసం నిరీక్షిస్తున్నారు.

ADVERTISEMENT

సాధారణంగా ఎప్పుడూ బయట కనిపించని సూపర్ స్టార్, ఈ మెకోవర్ లో మాత్రం కాస్త ఎక్కువగానే కనిపించడం విశేషం. తాజాగా మరోసారి ఎయిర్ పోర్ట్ లో ఇదే లుక్ క్లిక్ అవ్వడంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నారు మహేష్ బాబు.

ఇలా వైరల్ కావడం కంటే కూడా, ఇదే లుక్ తో రాజమౌళి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలితే అభిమానులకుండే ఉత్సాహం, ఊపు వేరు కదా! ఒకవేళ ఇదే లుక్ తో జక్కన్న ఓ అధికారిక ఓ పోస్టర్ ని రిలీజ్ చేసినా, ఫ్యాన్స్ కి కావాల్సిన కిక్ ని అది ఇవ్వకపోవచ్చు.

దేశీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఇంట జరిగిన వివాహ మహోత్సవ వేడుకకు హాజరైన సమయంలో కూడా బాబు లుక్ వైరల్ కావడంతో, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వర్గాలలో కూడా సూపర్ స్టార్ హాట్ టాపిక్ గా వినిపించారు.

అంతకు ముందు, ఆ తర్వాత కూడా సినిమా ట్రైనింగ్ నిమిత్తం మరియు ఫ్యామిలీ టూర్ ల కోసం విమానాశ్రయాలలో మహేష్ తళుక్కుమనడం, ఆ తర్వాత ఇంటర్నెట్ లో హల్చల్ చేయడం సాధారణంగా మారిపోయింది.

ఇవన్నీ జక్కన్న పరిశీలనలో ఉన్నాయో లేదో గానీ, మహేష్ బాబుని ఇలా చూడడం కంటే కూడా, ఫస్ట్ లుక్ పోస్టర్ లోనో లేక ఓ శాంపిల్ టీజర్ లోనో కనిపిస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. దసరాకైనా ఆ సరదా తీరుస్తారో లేదో మరి!

ADVERTISEMENT
Latest Stories