“బీ-టౌన్”లోను భారీ డిమ్యాండే!

Mahesh Babu Maharshi hindi rightsబాహుబలి ముందు వరకూ మనకు బీ టౌన్ అంటే అదేదో కొత్త ప్రపంచం లాగానే ఉండేది. అయితే బాహుబలి పుణ్యమా అని, అటుపై మన బడా హీరోల సినిమాలకు అక్కడ కూడా భారీ డిమ్యాండే వచ్చింది. వరుసగా మన పెద్ద హీరోల సినిమాల రైట్స్ కొంటూ అక్కడ కూడా మన సినిమాలు విడుదల చేస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా రోబోతో మన దక్షిణాది హీరోల సినిమాలకు మరింత డిమాండ్ పెరిగింది అని చెప్పవచ్చు.

[m9ad]

ADVERTISEMENT

అయితే…ఇదిలా ఉంటే మరి మరో పక్క మన యువ హీరోల సినిమా రైట్స్ కి అక్కడ భారీ డిమ్యాండే ఉంది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ అరవింద సమేతా 18 కోట్లకు కొంటే…అంతక ముందే చెర్రీ రంగస్థలం 22 కోట్లకు కొన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి కూడా దాదాపుగా 20 కోట్లకు పైగానే రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.

మరో పక్క చెర్రీ కున్న మాస్ ఫాలోయింగ్, ఇక ఇప్పటికే చెర్రీ హిందీలో ఒక సినిమా చెయ్యగా, మరో పక్క రంగస్థలం పుణ్యమా అని, చెర్రీ తాజా సినిమా వినయ-విధేయ-రామ సినిమాని ఏకంగా 22 కోట్లకు బీ టౌన్ వాళ్ళు కొన్నారు అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో కూడా తన ముద్ర బలంగానే వేస్తున్నారు అని స్పష్టంగా చెప్పవచ్చు,

ADVERTISEMENT
Latest Stories