వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా “మహర్షి” షూటింగ్ ప్రస్తుతం న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్ లో మహేష్ ను ఎలాగైనా కలుసుకోవాలని ఓ అభిమాని చేసిన ప్రయత్నం సస్పెన్స్ థ్రిల్లర్ కధను తలపిస్తోంది. దాదాపుగా వారం రోజుల పాటు మహేష్ కోసం సాగించిన వేటను తన ట్విట్టర్ ఖాతాలో సదరు అభిమాని వివరించారు.
[m9ad]
21వ తేదీన న్యూయార్క్ లో ల్యాండ్ అయిన అభిమాని, అంత పెద్ద మహానగరంలో మహేష్ ఎక్కడుంటారో తెలియని పరిస్థితులలో…. నమ్రత పోస్ట్ చేసిన ఓ ఫోటో అతనికి క్లూలా లభించింది. తాజ్ లో సితార పాప – అలియా భట్ ఫోటో చూసి, ఇక తాజ్ బయటే గంటల కొద్ది సమయాన్ని గడిపానని, షూటింగ్ అయిపోయిన తర్వాత మహేష్ వస్తారు, కనిపిస్తారని ఎదురుచూశానని, కానీ సెక్యూరిటీకి మాత్రం బాగా నోట్ అయిపోయానని, మా ఇండియన్ యాక్టర్ కోసం తిరుగుతున్నానని ఏదో చెప్పుకున్నానని తెలిపాడు.
నమ్రత గారు పోస్ట్ చేసిన పిక్చర్స్ నుండి కొంచెం కొంచెం డీటెయిల్స్ తీసుకుని ఆ లొకేషన్స్ కు వెళ్ళిపోయేవాడ్ని గానీ, తనకు ఏది వర్కౌట్ కాలేదని, ఇక తాను మహేష్ ను చూస్తానన్న నమ్మకం సన్నగిల్లిందని, అప్పుడు మహేష్బాబు అఫీషియల్ టీంకు వరుసగా మెస్సేజ్ లు పెట్టగా, 25వ తేదీన వాళ్ళను కలిసానని, ఫైనల్ గా… 27వ తేదీన మహేష్ బాబును కలిసాను… అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
చాలా రోజుల తర్వాత హాయిగా పడుకున్నానని, అద్భుతమైన అనుభూతులతో ఇక తాను న్యూయార్క్ ను వదిలేస్తున్నానని, నా జీవితంలోని కలను నెరవేర్చుకున్నానని ఎంతో ఖుషీతో తెలిపాడు. ఎంతో ఆసక్తికరంగా రాసిన ఈ కధ, సినిమాల్లోని ప్రేమికుల మధ్య నడిచే కధలా సాగింది. వారం రోజుల పాటు మహేష్ కోసం సాగించిన వేటలో ఫైనల్ గా విజేతగా నిలవడంతో రెట్టించిన ఉత్సాహంతో తిరుగుముఖం పట్టాడు సదరు అభిమాని.
Best part of meeting @urstrulyMahesh anna today at #Maharshi shoot was meeting our fan family. If meeting mahesh anna is a peak in my life, meeting these amazing people was an icing on the cake. Best day of my life 🙏🏼 @urstrulySou @nagasaitej @Keshav4005 @VINAYCR7_ pic.twitter.com/R4nNfuAPU1
— Chaitanya Somavajhala (@ChaitanSrk) October 28, 2018
Forever indebted to this man for the entertainment he has given and the commitment this man has shown to Telugu cinema. Can’t thank him enough. #SuperStarZindabad #HBDSuperstarMahesh pic.twitter.com/41gP6JotId
— Chaitanya Somavajhala (@ChaitanSrk) August 8, 2018



