‘త్రివిక్రమ్ –మహేష్’ టైటిల్ పెట్టేసారు!

Hare-Krishna-Hare-Rama movieవర్తమానం నుండి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళితే… “అతడు” సినిమా సక్సెస్ సాధించిన తరుణంలో… హైదరాబాద్ సంధ్య 35ఎంఎంలో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల సమక్షంలో దర్శకుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ కో’ చిత్ర 175 రోజుల సంబరం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ తో ‘ఒక్కడు’ సినిమాను నిర్మించిన ఎంఎస్ రాజు కూడా హాజరయ్యారు. సాధారణంగా ఉద్వేగభరితం కాని త్రివిక్రమ్, ఈ వేడుకలో మహేష్ తో తాను తీయబోతున్న కొత్త సినిమా ప్రాజెక్ట్ ను ప్రకటించారు.

ADVERTISEMENT

ఎం.ఎస్.రాజు నిర్మాతగా “హరే రామ హరే కృష్ణ” టైటిల్ తో మహేష్ బాబును హీరోగా పెట్టి, మరో గొప్ప సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నానని, ‘జై మహేష్’ అంటూ త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రిన్స్ అభిమానులకు గుర్తుండే ఉంటాయి. అయితే ఆ తర్వాత ప్రిన్స్ తో త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు గానీ, అది ‘హరే రామ హరే కృష్ణ’ కాకుండా, “ఖలేజా” అయ్యింది. అలాగే ఇటీవల కూడా త్రివిక్రమ్ – మహేష్ కాంభినేషన్లో ఓ సినిమా ప్రకటన వచ్చింది. ఇది కూడా ఆ ‘రామ – కృష్ణ’ల కధ కాదని తేలింది.

అయితే ఈ ‘హరే రామ హరే కృష్ణ’ల స్పెషల్ ఏమిటంటే… మహేష్ ను డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నాను అంటూ నాడు త్రివిక్రమ్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ సినిమా టైటిల్ మహేష్ అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. అయితే తాజాగా ఇదే టైటిల్ తో ఓ చిన్న సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరో పరిచయం కానుండగా, రెజీనా హీరోయిన్ గా కన్నులవిందు చేస్తోంది. అలాగే అర్జున్ సాయి దర్శకుడిగా పరిచయం కానుండగా, నవీన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తునారు.

ADVERTISEMENT
Latest Stories