అఫీషియల్ : గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మహేష్ సినిమా!

Mahesh babu movie with gautham menonప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలని తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్, అదే ప్రిన్స్ తో ఒక సినిమాను నిర్మించాలని మెగా నిర్మాత అశ్వనీదత్ కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న వైనం సినీ వర్గాలకు తెలిసిందే. అయితే ఆ ‘ముహూర్తం’ త్వరలోనే సాకారం అవుతుందని నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, మహేష్ చిత్రం తర్వాత రామ్ చరణ్ తేజ్ తో కూడా ఒక సినిమాను నిర్మించబోతున్నానని ప్రకటించారు.

ఇక, రాజకీయాల ఊసు కూడా ఎత్తిన అశ్వనీదత్, “గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తు చేసుకున్న అశ్వనీదత్, ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని” అన్నారు. తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టారు ఈ ‘మెగా’ నిర్మాత.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories