‘ఐ ఫీస్ట్’లా మహేష్ – మురుగదాస్ మూవీ!

Mahesh Babu Murugadoss shooting in Vietnamజూన్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న మురుగదాస్ – ప్రిన్స్ మహేష్ బాబుల సినిమా షూటింగ్ ప్రస్తుతం వియత్నాంలో జరుగుతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ‘స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్’గా తెరకెక్కుతోందని, ఇప్పటికే చిత్ర యూనిట్ వర్గాలు వివిధ సందర్భాలలో స్పష్టం చేసారు. దీనిని ధృవీకరించే విధంగా తాజాగా వియత్నాంలో జరుగుతున్న షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

వియత్నాంలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ షెడ్యూల్ లో టాలీవుడ్ లో మునుపెన్నడూ చూపించని విధంగా ఈ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ ప్రేక్షకులకు “ఐ ఫీస్ట్”లా ఈ సినిమాలోని యాక్షన్ దృశ్యాలు ఉండబోతున్నాయి. సముద్రంలోని కొండల నడుమ చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ షాట్స్, సాధారణ ఫోటోలలోనే ఇంత అద్భుతంగా ఉంటే, సిల్వర్ స్క్రీన్ పైన ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనవసరం లేదనుకుంటా!

ADVERTISEMENT

మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ లుక్’ విడుదల అవుతుందని అంతా భావిస్తున్న నేపధ్యంలో… ఇప్పటివరకు చిత్ర యూనిట్ వర్గాల నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఉగాదికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తే, ఏప్రిల్ లో రాబోయే తమిళ ఉగాదికి ఫస్ట్ టీజర్ ను, మే నెలాఖరులో ఆడియోను, జూన్ లో సినిమాను విడుదల చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories