ప్రిన్స్ ఫ్యాన్స్ కు డిజప్పాయింట్ మెంట్?

Mahesh Babu - Vamsi -Paidipallyఆగష్టు 9వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విషయం ఏమిటంటే… ప్రిన్స్ పుట్టినరోజును పురస్కరించుకుని, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటనను ఆదివారం నాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించనున్నారు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఫ్యాన్స్ కు నిరాశ చెందే విషయం ఏమిటంటే… ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు 30 సెకన్ల నిడివి గల టీజర్ విడుదల అవుతుందని భావించారు. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ అవుతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా టైటిల్ ప్రకటన కూడా ఉండకపోవచ్చని లభించిన కీలక సమాచారం. బహుశా పోస్టర్ అదిరిపోయే విధంగా ఉంటే, ఫ్యాన్స్ అంతా వీటిని మరిచిపోతారేమో!

[m9adh]

ADVERTISEMENT
Latest Stories