సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న “సర్కార్ వారి పాట” టీమ్ నుండి అప్ డేట్స్ లభించక మహేష్ బాబు అభిమానులు నిరాశలో ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ విడుదల అన్న ఒక్క సమాచారం తప్ప ప్రమోషన్ మెటీరియల్ ను రంగంలోకి దించకపోవడమే ఫ్యాన్స్ నిట్టూర్పుకు ప్రధాన కారణం.
రిలీజ్ పోస్ట్ పోన్ చేయడానికి ముందు జరిగిన హంగామాతో ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్ వస్తుందన్న ప్రచారం జరిగింది. దీంతో ఎంతో ఆసక్తిగా నిరీక్షించిన ఫ్యాన్స్ కు పోస్ట్ పోన్ న్యూస్ వచ్చింది గానీ, లిరికల్ సాంగ్ రాలేదు. అయితే విడుదలకు ఇంకా అయిదు నెలల సమయం ఉండడమే చిత్ర ప్రమోషన్స్ కు ఆలస్యమని సినీ వర్గాలు చెప్తున్నాయి.
సంక్రాంతికి సినిమా ఎలాగూ దూరమైంది కాబట్టి, పండగకు కనీసం ఒక్క సాంగ్ నైనా వదలండి అంటూ సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాతలకు విన్నవించుకోవడం ప్రిన్స్ ఫ్యాన్స్ వంతవుతోంది. ఆలస్యం అయినా ‘సర్కార్’ వారి సాంగ్ అదిరిపోవాలి అనేది ఫైనల్ గా అభిమానులు కోరుకుంటున్న అంశం.



