మహేష్ బాబు కోరిక ఎప్పటి నుండి తీరుతుందో?

Mahesh Babu  searching for director to debut in bollywood
తెలుగు హీరోలలో బాలీవుడ్ హీరో లుక్స్ ఉన్న హీరో ఎవరంటే మొదట చెప్పే పేరు మహేష్ బాబు. కొన్ని యాడ్ల ద్వారా ఆయన దేశవ్యాప్తంగా ఆడియన్స్ కు సుపరిచితమే. తాను ఒక పాన్- ఇండియా స్టార్ కావాలనే కోరిక మహేష్ బాబుకు ఎప్పటి నుండో ఉంది.

తెలుగులో మన స్టార్ హీరోలు ఇంకా 100 కోట్ల షేర్ మార్క్ అందుకోవడానికి తిప్పలు పడుతున్నారు. అదే ప్రభాస్ అయితే మొదటి వారాంతంలోనే ఆ మార్కు దాటేస్తున్నాడు. కారణం దేశవ్యాప్తంగా ఉన్న మార్కెటే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఆ అవకాశం ఆర్ఆర్ఆర్ తో ఉంది.

ADVERTISEMENT

దీనితో మహేష్ బాబు కూడా కంగారు పడుతున్నాడు. దేశవ్యాప్తంగా విడుదలై సినిమా ను ఇవ్వగల దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు. మొన్న ఆ మధ్య ఇదే విషయంగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ని కూడా కలిశాడు మహేష్. అయితే ఇప్పటివరకూ ఏదీ ఫైనల్ కాలేదు.

స్పైడర్ సినిమాతో తమిళనాడులో మార్కెట్ కోసం ప్రయత్నం చేసాడు మహేష్ బాబు. అయితే ఆ ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. ఆ తరువాత ఆ ప్రయత్నాలు కూడా మానేశాడు. ఇప్పుడు మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories